
జన సముద్రం న్యూస్,13 ఏప్రిల్, గుంతకల్.
అనంతపురము జిల్లా గుంతకల్లు పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన గౌరవ కేంద్ర రైల్వే, బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ రావుసాహెబ్ దాన్వే గారిని గుంతకల్లు రైల్వే ఇన్స్టిట్యూట్ నందు ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషద్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు పుష్పగుచ్చంతో జిల్లాకు స్వాగతం పలికారు.దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రోజ్ గార్ యోజనా పథకంలో భాగంగా నుతనంగా నియమితులైన ఉద్యోగులకు నియామక ఉతర్వులను అందించే కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన సందర్భంగా, గుంతకల్లు రైల్వే ఇన్స్టిట్యూట్ నందు గౌరవ కేంద్ర రైల్వే, బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ రావుసాహెబ్ దాన్వే గారు ముఖ్య అతిధులుగా దక్షిణమధ్య రైల్వే వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక శాసన సభ సభ్యులు శ్రీ వెంకట రామి రెడ్డి గారు, ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు, MLC శ్రీ శివరామి రెడ్డి గారు, స్థానిక మునిసిపల్ మేయర్, దక్షిణమధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ శ్రీ వెంకట రమణా రెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇతర రైల్వే సిబ్బంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నూతనంగా నియమితులైన ఉద్యోగులు పాల్గొన్నారు.





