
✦అంగరంగ వైభవంగా విద్యుత్ దీప కాంతుల నడుమ భక్తులకు దర్శనం.
జనసముద్రం న్యూస్:ఏప్రిల్,12.
శ్రీ సత్యసాయి జిల్లా:
జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:
అమడగూరు న్యూస్: శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలలో భాగంగా బుధవారం నాడు రాత్రి సింహాహనం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి పల్లకిని ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు నడుమ జడ్పిటిసి కవిత శివశంకర్ రెడ్డి రథాన్ని ప్రారంభించారు.బస్టాండ్ పురవీధుల గుండా ఆనవాయితీగా వస్తున్న ఉట్టి వరకు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఊరేగింపు సాగింది.అంగరంగ వైభవంగా విద్యుత్ దీప కాంతుల నడుమ అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.అడుగడుగునా భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ టెంకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.మండల పరిధిలోని కొలిమిరాళ్లపల్లి గ్రామానికి చెందిన కడగుట్ట కుటుంబ సభ్యులు జడ్పిటిసి కవిత,శివశంకర్ రెడ్డి,వరుణ్ తేజ్ రెడ్డిలు ఉత్సవ నిర్వహకులు ఉభయ దారులుగా వ్యవహరించారు.ఉట్టి వద్ద ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం అమ్మవారు తిరిగి ఆలయానికి చేరుకుంది.అమ్మవారి ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యస్ఐ వెంకట్ నారాయణ,పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి,సూర్యనారాయణ రెడ్డి (సూరి),ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.





