
జన సముద్రం న్యూస్,10 ఏప్రిల్ :
అనంతపురం.గౌరవనీయులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు తమ పరిధిలో గల అనంతపూర్ రూరల్ మండలం లో గ్రామాలలో ఏప్రిల్ నెలలో జరిగే గ్రామ సభలు తప్పక నిర్వహించాలని అలాగే గతం లో జరిగిన గ్రామ సభలలో కొన్నిచోట్ల నిర్వహణ లోపం వల్ల ప్రజలు సరిగా హాజరు కాలేక పోయారని తప్పకుండా గ్రామాల్లో గ్రామ సభల గురించి ప్రజలకు తెలిసేలా చేసి అందరూ హాజరు అయ్యేలా చర్యలు చేపట్టే విధంగా అధికారులకు తెలియజేయాలని ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక తరపున ఎంపిడిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అలాగే అన్ని చోట్ల గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం వల్ల కొంతమంది అధికారులు ఒకటి రెండు చోట్ల మాత్రమే హాజరవుతున్నారు అని కాబట్టి సమయ పాలన బట్టి రెండు మూడు రోజులు ఈ గ్రామ సభలు జరపాలని తెలిపారు ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు టీవీ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి కె అల్తాఫ్ , అనంతపురం రూరల్ ప్రధాన కార్యదర్శి సంగా ఫణి భూషణ్ , న్యాయవాది గుర్రం జయరాజు పాల్గొన్నారు.





