
( జనసముద్రం న్యూస్ ఉంగుటూరు మండలం)
ఉంగుటూరు, ఏప్రిల్ 5:
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు హాజరైన ఏలూరు టిడిపి పార్లమెంటరీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ లాంటి నాయకులను స్మరించుకోవడం, వారి జయంతి, వర్ధంతి వేడుకలను జరుపుకోవడం వారి చరిత్ర రానున్న తరాలకు ఆయన స్ఫూర్తి తెలియజేయడమేనని అయన కొనియాడారు. వేడుకలకు హాజరైన విగ్రహ దాత జనసముద్రం న్యూస్ బ్యూరో ఇంచార్జ్ జర్నలిస్ట్ పుట్టా కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ పేద, బడుగు వర్గాల పట్ల పోరాడిన వ్యక్తి అని తెలిపారు. బాబు జగ్జీవన్ రావ్ దేశోన్నతికి ఎంతగానో శ్రమించారు.1971లో ఇండో,పాక్ యుద్ధంలో రక్షణ మంత్రిగా తన ప్రాముఖ్యత చూపారని తెలిపారు. భారతదేశంలో ఆకలి కేకలు వినపడకూడదని హరిత ఉద్యమం చేపట్టారు,స్వాతంత్ర ఉద్యమకారులు, రాజకీయవేత బాబు జగ్జీవన్ రావ్ అని కొనియాడారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ టిడిపి నాయకులు సజీవరావు మాట్లాడుతూ ఎస్సీలు వివిధ హోదాల్లో ఎదుగుతూ తమ జీవనశైలి మెరుగుపరుచుకుని రాజకీయాల్లో కూడా రాణించాలి అని ఆయన కోరారు. ఈ సందర్భంగా మండల ఎస్సీ సెల్ నాయకులు ఆశీర్వాదం మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారితో పాటు వివిధ దళిత నాయకుల్ని తలుచుకుంటూ వారి ప్రాముఖ్యత తెలుపుతూ వారిని కొనియాడారు. నియోజవర్గ నాయకులు యుగంధర్ గారు డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ గారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ సభ్యులు, మాజీ ఏఎంసీ చైర్మన్, ఉంగుటూరు టిడిపి మండల అధ్యక్షులు పాతూరి విజయకుమార్,ఏలూరు పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి సుర్చేంద్రరావు,సీరియల్ నాయకులు ఇమ్మని గంగాధర్, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు సజీవరావు, పైడిమాల యుగంధర్, ఆశీర్వాదం. లీగల్ సెల్ నాయకులు ఈర్లపాటి మోషే పాల్గొన్నారు.







