
మిర్యాలగూడ,దామరచర్ల మండలాల్లో.. ఐకెపి కేంద్రాలను ప్రారంభించిన భాస్కర్ రావు …
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 13:
మిర్యాలగూడ మండల పరి ధిలోని …తుంగపహాడ్ మరియు దామరచర్ల మండల పరిధిలోని…దిలావర్ పుర్, కేజేఆర్ కాలని.. నందు నూతన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను “ఐకెపి సెంటర్ ” లను ఈరోజు ఏప్రిల్ 13న మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మండలాల ప్రజా ప్రతినిధులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, …. లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ..

రైతుల ధాన్యాన్ని ఎండబెట్టి తీసుకొని రావాలని, రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని అన్నారు. ఈ ధాన్యం నాణ్యంగా ఉండేటట్టు చూసుకోవాలని తెలిపారు. ఐకెపి సెంటర్లలో … ఎటువంటి అవకతవకలు… జరిగిన నా వద్దకు రాగలరని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన రైతన్నలు తగు జాగ్రత్తలు తీసుకొని రావాలని మరెన్నో విషయాలు మాట్లాడటం జరిగింది.ఈ
కార్యక్రమంలో నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, మిర్యాలగూడ మండల ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు అంగోతు హతిరాం నాయక్, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పాక్స్ చైర్మన్ శాగం ఆదిరెడ్డి, మాజీ డిసిసిబి డైరెక్టర్ లావుడి హర్యా నాయక్, మాజీ ఎంపీపీ ఒగ్గు జానయ్య, సర్పంచులు పోలేని నవ్య సైదులు, ధనావత్ యమున రాంసింగ్, ధనావత్ శారద సైదా నాయక్, మాలవత్ రవీందర్ నాయక్, లావుడి చవాలి, కేజేఆర్ కాలనీ ఎంపీటీసీ వీరా నాయక్, మాజీ సర్పంచ్ సజ్జల శ్రీనివాస్ రెడ్డి, చిమట యాదగిరి, తుమ్మల ఫణి కుమార్, వాంకుడోతు సురేశ్ నాయక్, లింగయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, మిర్యాలగూడ ఎంపీడీవో గార్లపాటి జ్యోతి లక్ష్మి, ఆయా గ్రామాల గ్రామ శాఖ అద్యక్షులు, అన్నదాతలు, మండలాల ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





