
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక , ఏప్రిల్ 12.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఉప్పాక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించి దళిత బహుజనుల అభ్యున్నతే లక్ష్యంగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. చిన్న రాష్ట్రాలతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమని రాజ్యాంగంలో పొందుపరిచినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బందును అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని, తెలంగాణలోని ప్రతి కుటుంబానికి దళిత బంధు ను వర్తింప చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందుకే అంబేద్కర్ పేరు ప్రపంచంలో చివర స్థాయిగా నిలిచిపోయేలా సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరుతో నామకరణం ,అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కు ఈనెల 14న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రతినిధి కోలేటి భవాని శంకర్ ,బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ,దాట్ల వాసు బాబు, స్థానిక సర్పంచ్, నాయకులు ,కార్యకర్తలు ,పాత్రికేయులు పాల్గొనడం జరిగింది.





