
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లో.
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 12
మల్కాజ్గిరి బీజేవైఎం నాయకులు దోమల సమస్యపై జిహెచ్ఎంసి నార్త్ జోన్ చీఫ్ ఎంటమాలజిస్ట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం అసెంబ్లీ కో కన్వీనర్ జిల్లెల భరత్ యాదవ్ మాట్లాడుతూ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లో దోమల సమస్య విపరీతంగా ఉందని సాయంత్రం పూట ఏ గల్లిలో చూసిన దోమల సైర విహారం చేస్తున్నాయని స్థానిక ప్రజలు డెంగ్యూ మలేరియాతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారని. ప్రతి బస్తీలో కాలనీలలో 15 రోజులకు ఒకసారి ఫాగింగ్ చేస్తున్నారని. ఆ ఫాగింగ్ కూడా నాసిరకంగా ఉందని ఫాగింగ్ లో వాడే అసలు మందు పక్కదారి పడుతుందని అనుమానం కలుగుతుందని అన్నారు. ప్రతి డివిజన్లో సుమారు 40 కాలనీలు బస్తీలు ఉంటాయని కానీ ఫాగింగ్ సిబ్బంది ఇద్దరు మాత్రమే ఉన్నారని వెంటనే సిబ్బంది కూడా పెంచాలని రెండు రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ చంద్రకాంత్, జిల్లా అధికార ప్రతినిధి ఈసం రాకేష్, జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ ఆకారం సాయిరాం, మల్కాజిగిరి డివిజన్ ఉపాధ్యక్షులు సాయి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.





