తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : నల్లమోతు భాస్కర్ రావు…

Spread the love

మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆయా మండలాల లబ్ధిదారులకు… చెక్కులను అందజేసిన భాస్కర్ రావు…

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 11:

మిర్యాలగూడ పట్టణంలోని ఏ ఆర్ సి గార్డెన్స్ లో … మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులను నియోజకవర్గం లోని ఆయా మండలాల లబ్ధిదారులకు …. అందజేయడం జరిగింది.

ఈ పధక చెక్కుల వివరములు..

నియోజకవర్గ వ్యాప్తంగా 398మంది లబ్ధిదారులకు… రూ.3కోట్ల 98లక్షల 46వేల 168 విలువైన చెక్కులను
భాస్కర్ రావు అందజేశారు .
మిర్యాలగూడ టౌన్,మండలం లో 255 మందికి… 2కోట్ల 55 లక్షల 29 వేల 580 రూపాయలు, దామరచర్ల మండలంలో 63 మందికి… 63 లక్షల 82వేల 308 రూపాయలు , అడవిదేవులపల్లి మండలంలో 19 మందికి… 19 లక్షల 2 వేల 204 రూపాయలు, మాడ్గుల లపల్లి మండలంలో 23 మందికి… 23 లక్షల 82 వేల 308 రూపాయలు , వేములపల్లి మండలంలో 38 మందికి … 38 లక్షల 4 వేల 408 రూపాయలుచెక్కులను… అందజేశారు.

ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్… అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లి ల భారాన్ని తగ్గిస్తున్నారని మాట్లాడారు . ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం” మని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని కేవలం బీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని భాస్కర్ రావు తెలిపారు. రానున్న ఎన్నికలలో బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ…. కలిసి పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేయాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు కుందూరు వీర కోటిరెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, దామరచర్ల ఎంపీపీ ధీరావత్ నందిని రవితేజ, ఎంపీటీసీలు … సోము సైదిరెడ్డి, బాల సత్యనారాయణ, వీరా నాయక్,… లు, వాచ్య తండా సర్పంచ్ శ్రీను నాయక్, తదితర ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి