పరీక్షలపై భయాందోళనలు అక్కరలేదు: మాలోతు దశరథ్ నాయక్..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్, ఏప్రిల్ 7 :

  రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ అధ్యర్యంలో పదవ తరగతి పరీక్షలు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయని, విద్యార్థులు ఎటువంటి భయాందోళనాలకు గురికావాల్సిన అవసరం లేదని, ధైర్యంగా పరీక్షలు వ్రాసి    గ్రేడింగ్ సాధించాలని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరత్ నాయక్ కోరారు.

శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ..

పరీక్షలు ప్రారంభం…దగ్గర నుంచి ప్రతిరోజూ పేపర్ లీక్ పేర్లతో వార్తలు వస్తుండడంతో…అసలు పరీక్షలు జరుగుతాయా?, వాయిదా పడతాయా? అని ప్రతిరోజూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారని తెలిపారు. మరో వైపు విద్యార్థులు పరీక్షలకు భయంతో సరిగా సిద్ధం కాలేకపోతున్నారని అయన అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పరీక్షలు పక్కడ్బందీగా జరుగుతున్నాయని ఎటువంటి రాజకీయ జోక్యం పరీక్షలలో అవసరం లేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు పరీక్షలకు సిద్ధం అయ్యేలా చూసుకోవాలని పరీక్షలపై దైర్యం కల్పించాలని కోరారు.ఇప్పటికి మూడు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మిగిలిన మూడు పరీక్షలు అలానే జరుగుతాయని అన్నారు. బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పరీక్షలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.చిన్న పిల్లల పరీక్షలపై ఎవరైన రాజకీయం చేయడం తగదన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. పరీక్షలు ప్రశాంతంగా విద్యార్థులు రాసుకునేలా అందరూ సహకరించాలని కోరారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి