
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు ,ఏప్రిల్ 7.
-చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే స్థాయికి దిగజారినతనం.
-ప్రైవేటు పాఠశాలలో ర్యాంకులు గ్రేడుల కోసం పాకులాట.
విద్య అనగా బోధన, సమిష్టి నైపుణ్యాల అభ్యాసనం.మానవుడిలో దాగి ఉన్న అంతర్ జ్ఞానాన్ని వెతికి తీయడం. ప్రతి మానవుడికి విద్య అంతర్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంతటి మహోన్నతమైన విద్యను ప్రస్తుత ప్రపంచంలో రాజకీయ నాయకుల చేతులలో కీలుబొమ్మలా తయారైందని ,ప్రస్తుత కాలంలో చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే రోజుల వచ్చాయని ప్రతి పేదవాడి కుటుంబానికి విద్య అందించలేని పరిస్థితి ఏర్పడిందని సామాజిక కార్యకర్త కర్నే రవి వాపోయారు .ఈ మేరకు మణుగూరు మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నాడు – నేడు పెట్టుబడిదారులకు చక్కటి ఆదాయ వనరుగా విద్యా వ్యవస్థ తయారైందని, ప్రభుత్వం అవలంబిస్తున్న మూస పద్ధతులకు స్వస్తి పలికి ప్రతి పేదవాడి సంతానం విద్యావంతులయ్యే విధంగా కృషి చేసే విధంగా చూడాలని తద్వారా సమాజంలో విద్యావంతులు పెరిగి ఊహించని ఫలితాలు ఏర్పడతాయని రానున్న రోజుల్లో జ్ఞానసముపార్చనలో విద్య ప్రాముఖ్యత సంతరించుకునే రోజులు వస్తాయని, విద్య అందుబాటులోకి రాకుంటే సమాజం గడ్డు పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపారు. యువత రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలంటే విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించాలని, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటు పాఠశాలలకు ర్యాంకులు తెచ్చే ఆదాయంలా విద్య కనిపిస్తుందన్నారు. విద్యను సహజ పద్ధతిలో అందించాల్సింది పోయి ,బట్టి విధానంలో ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయని ప్రస్తుత ప్రపంచంలో విద్య ఒక కీలుబొమ్మలా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లటం, ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకవడం వలన విద్య అంగడిలో దొరికే సరుకుల తయారయిందని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మెరుగైన విద్యను ప్రతి ఒక్కరికి అదే విధంగా చర్యలు తీసుకోవాలని తద్వారా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడ్డవారవుతారని కోరారు.





