విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేస్తారా….?

Spread the love
  • బిజెపి ప్రభుత్వం పై మండిపడ్డ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఏప్రిల్ 5.

విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతుందని టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసపాలు చేయడానికి బిజెపి అగ్ర నాయకత్వం చేసిన కుట్రలో భాగంగానే ఈ పేపర్ లీకేజీలనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. విద్యార్థులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దివాలా కోరు రాజకీయ విధానాలకు నిదర్శమని విమర్శించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయడం రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ,ఈ విషయంలో వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు .చిల్లర రాజకీయాలు చేస్తున్న బిజెపి పార్టీలకు రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, భవాని శంకర్, రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మొగులపల్లి నరసింహారావు, ఎంపీటీసీలు కాయం శేఖర్, చింతపంటి సత్యం, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి