పార్టీ వ్యతిరేకులపై క్రమశిక్షణ సంఘం చర్యలు: గొడిశాల రామనాధం.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి శ్రీనివాస్, పినపాక, ఏప్రిల్ 5.

పినపాక మండలం , ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో గల కాoగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే పోదెం వీరయ్య రెడ్డి కులస్థులను ఉద్దేశించి ఏమి మాట్లాడలేదని,అందరితో కలిసిపోయేతత్వం కలిగిన పోదేం వీరయ్య ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఏమి అనలేదని, కావాలనే అల్లర్లు సృష్టించాలని కొంతమంది పార్టీ వ్యతిరేకులు చూస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నుంచి ఎన్నిరకాల ఒత్తిడులు వచ్చిన నమ్ముకున్న ప్రజల కోసం, కార్యకర్తల కోసం, పార్టీ కోసం, అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తినా మీరు తప్పు పట్టేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పినపాక నియోజకవర్గం లో వర్గపోరు కి పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులను, సీతక్క పేరును చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ అభిమానులను, అటు ప్రజలను గంధర గోళంలో నెట్టివేస్తూ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని సోషల్ మీడియా ద్వారా చిల్లర పోస్టులు పెడుతూ పార్టీ కి కట్టుబాటుగా పని చేసే వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.ఇటువంటి వాళ్ళను గుర్తించి వారిపై పార్టీ క్రమశిక్షణ సంఘం పార్టీ నుండి సస్పెండ్ చేయవలసినదిగా అధిష్టానాన్ని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ తరుపున కోరామన్నారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీనివాసరావు,మండల జనరల్ సెక్రటరీ జక్క వెంకటేశ్వర్లు,మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ మదర్ సాహెబ్,బోడ రమేష్ జిల్లా నాయకులు, భాస్కర రెడ్డి,నియోజకవర్గం మైనారిటీ కన్వీనర్ బసురుద్దీన్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గట్ల శ్రీనివాస్ రెడ్డి, కొమరం రమేష్, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బత్తుల వెంకటేశ్వర రెడ్డి, బోడ తిరపతయ్య, కోడి రెక్కల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి