బాబు జగ్జీవన్ రాం ఆశయసాధనకు కృషి చేయాలి

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 5:

భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి,స్వాతంత్ర సమరయోధుడు, దళిత వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన బాబు జగ్జీవన్ రాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగోండి మురళి యాదవ్, సామాజికవేత్త జ్వాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకుని బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని మాస్టర్ మైండ్ పాఠశాల, వై జంక్షన్, మహిముద్ టీ స్టాల్ వద్ద జరిగిన జయంతి ఉత్సవాల్లో వారు పాల్గొని పూల మాల, పూలువేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ…

పేద వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన సూచించిన మార్గంలో దళిత వర్గాలు నడవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సైదులు, పాపయ్య,నాగయ్య,రూప, సామాజిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరాజు జయరాజు, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ సైదా నాయక్, శ్రీను, జిల్లా వెంకటేశ్వర్లు, గౌస్ బాషా, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి