
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 05
బుధవారం మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ని శామీర్ పేట కు చెందిన మైనారిటీ నాయకులు జామా మసీదు కమ్యునిటి హాల్ నిర్మాణం సహాయార్థం కోసం కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి సానుకూలత వ్యక్తం చేశారు, అదే విధంగా మల్లాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ను కూడా కలిశారు వారు కూడా సహాయం చేయడానికి సానుకూలత వ్యక్తం చేశారు. ఇరువురి కి ఆదివారం నాడు శామీర్ పేట లో జరిగే ఇఫ్తార్ విందు కు గానూ ఆహ్వానం కూడా తెలిపారు. కార్యక్రమం లో ఎంపిపి దాసరి ఎల్లుబాయి బాబు, మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్,జామా మశీదు సదర్ మహ్మద్ యూసుఫ్, ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, ఎంపిటిసి డపు సాయి బాబా,నాయకులు ఐలయ్య యాదవ్, మేడి రవి , చాంద్ పాషా, ఉమ్మర్ ,మహ్మద్ ఫారూఖ్, వంగ నర్సింహ రెడ్డి,దండుగుల మైసయ్య, మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్,నజామ్ నాసర్ అలీ, షేక్ సాజిద్, గొలుసు ల విష్ణు, వజ్జల మురళి, నవీన్ ముదిరాజ్,అహ్మద్ పాషా, ఇలియాస్, అజ్మత్, రహీం తదితరులు మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





