
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 4 :
ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో… హత్ సే హత్ జోడో యాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి , నల్గొండ డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 1200 రు చేశారని, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ.. ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, చిరు మర్రి కిష్టయ్య,తులసి నాయక్, కృష్ణయ్య, బ్లాక్ కాంగ్రెస్ పొదిల శ్రీను, రామలింగం, కాంతారెడ్డి, బసవయ్య గౌడ్,సురేందర్ రెడ్డి,దాసు, గోపాల్, మంగుతా కిషన్ లింగా నాయక్, బత్తుల శ్రీను, కోటేశ్వరరావు, వెంకట శివ, దుర్గారావు, వసంత్, మైనారిటీ నాయకులు.. సద్దాం, దావీద్ , ఖాదర్ ,.. లు, శివ నాయక్, ఆనంద్,మధు గౌడ్,విజయ్, కాంగ్రెస్ యువసేన యూత్ నాయకులు, ,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






