
జన సముద్రం న్యూస్,ఏప్రిల్04,అనంతపురం.
అనంతపురము రూరల్ మండలం అనంతపురము-1 పంచాయితీ పరిధిలోని అభ్యుదయ కాలనీ నందు గౌరవ అనంతపురము శాసన సభ సభ్యులు శ్రీ అనంత వెంకట రామి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని, ప్రతి గడప గడపకూ వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు ఏమేరకు అందుతున్నాయి? వారు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక YSRCP ప్రజా ప్రతినిధులు, నాయకులు & కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు మరియు పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.






