
జన సముద్రం న్యూస్,ఏప్రిల్ 04,అనంతపురం.
స్థానిక జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గారి క్యాంపు కార్యాలయము నందు కారుణ్య నియామకాల లో భాగంగా ఒకరికి(01) PRI సబ్ డివిజన్, ఉరవకొండ, ఒకరికి(01) మండల ప్రజా పరిషద్, పుట్లూరు నకు మొత్తం ఇద్దరికి (02) ఆఫీసు సబార్దినేట్లుగా కేటాయిస్తూ నియామక ఉతర్వులను ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ కె.భాస్కర్ రెడ్డి గారు, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ జె.శ్రీనివాసులు గారు, గణాంక అధికారి శ్రీ అమృతరాజ్ గారు,ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.






