
- మెడికల్ మాఫియా అరాచకం..
- దోచుకున్నది చాలక ఏడుపు..
- కీర్తి మెడికల్స్ పేరుతో మందుల షాప్ కొత్తగా ప్రారంభించి డిస్కౌంట్ ధరలకు అమ్ముతుంటేఅడ్డుకుంటున్నారు..
- దయచేసి అందరూ ఎవడు తక్కువకి ఇస్తే వారితో కొనండి..
జనసముద్రం న్యూస్, ఏప్రియల్ 01,అనంతపురం:
వారు ఇష్టానుసారం మందుల ధరలు పెంచేసి.. సామాన్యులకు కనీసం అర్ధరూపాయి తక్కువకు కూడా మెడిసన్ అమ్మరు… కానీ నగరంలో ఒక మెడికల్ షాప్ వారు తక్కువ ధరకే మంచి కంపెనీలకు సంబంధించిన మందులు విక్రయిస్తుంటే వారిని అడ్డుకుంటారు. మెడికల్ మాఫియా డిమాండ్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. మెడిసిన్ తాము అమ్మినట్టే భారీ ధరలకు విక్రయించాలట.. అలాగే డిస్కౌంట్స్ ఇవ్వకూడదట.. జనాన్ని ఇలాగే జలగల్లా పీల్చేయాలట. ఇందుకోసం సదరు మెడికల్ దుకాణం వద్ద ఆందోళనకు కూడా దిగారు. ఇంతకన్నా అరాచక ఎక్కడైనా ఉంటుంది. ఇప్పటికే సామాన్యులు తమ ఆదాయంలో కనీసం 20శాతం మెడిసిన్ కు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇలాంటి వారి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది






