పొట్టి శ్రీరాములు గారి త్యాగాలు మరువలేనివి. ఏ.ఐ.ఎస్.ఏ నగర ఇంచార్జ్ మంజునాథ్

Spread the love

జనసముద్రం న్యూస్,మార్చి 16, అనంతపురం.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి 122 వ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నగర ఇంచార్జ్ మంజునాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ
అమర జీవిగా ప్రజల హృదయాలలో నిలిపోయినా, నిష్కలమైన వ్యక్తి అని మహాత్మునిచే కీర్తించబడినా అవన్నీ కూడా పొట్టి శ్రీరాములు కి చెందుతాయి. 1901వ సంవత్సరం మార్చి 16న నెల్లూరులో పొట్టి శ్రీరాములు జన్మించారు. చిన్ననాటి నుండే దేశభక్తిని గుండెలలో నింపుకున్న వ్యక్తి. చిన్న నాడు ఉపాధ్యాయులందరి ముందు ధైర్యంగా, బ్రిటిష్ వారు మన దేశానికి చేస్తున్న అన్యాయాన్ని ఉపన్యాస పోటీలో వ్యక్త పరిచి పొగడ్తలు విమర్శలు సమాన స్థాయిలో అందుకున్న వ్యక్తి. నెల్లూరులో మహాత్మా గాంధీ గారి సత్యగ్రహ విధానంలో 29 రోజులు నిరాహార దీక్ష చేసి హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించారు. మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 54 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న మరణించారు. ఈయన దీక్ష ఫలితంగా అక్టోబర్ 1, 1953 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది సత్యం, అహింస ఎంతటి గొప్ప లక్ష్యాన్ని అయినా సాధించి పెడతాయని మరోసారి నిరూపితమైందని అన్నారు. కార్యక్రమం సురేష్, భార్గవ్, మహేష్, తదితులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్