
జన సముద్రం న్యూస్,మార్చి 15,అనంతపురం:
రాప్తాడు (మం) గొందిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ను సందర్శించి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నగర ఇంచార్జ్ మంజునాథ్ ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేక సమావేశమై అందుతున్న వసతుల గురించి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని విధ్యార్థులకు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు అందుతున్న పథకాల గురించి పాఠశాల ప్రిన్సిపాల్ గారిని అడిగి
మెను ప్రకారం భోజన వసతి నాణ్యత తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. భోజనంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వసతులు సక్రమంగా అందేలా చూడాలని (ఏ.ఐ.ఎస్.ఏ) నగర ఇంచార్జ్ మంజునాథ్ తెలిపారు ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించి పరిష్కరంచడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉజ్జిని, మహేంద్ర, మహేష్ తదితులు పాల్గొన్నారు.





