ఏపీ అసెంబ్లీ ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన

Spread the love
జనసముద్రం న్యూస్, మార్చ్ 15 :

నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో సమస్యల పరిష్కారంతో పాటు, అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. కాలి నడకన ప్లకార్డును ప్రదర్శిస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు.

 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎదుట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ప్లకార్డు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు.

అసెంబ్లీ బయట ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై ప్రకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్ర చేశారు. అంతరాత్మ ప్రభోదానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తానని, వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నానని కోటంరెడ్డి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతోందని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లు పోరాటం చేసి గళం వినిపిస్తున్నానని చెప్పిన కోటంరెడ్డి మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్లకార్డ్ ప్రదర్శిస్తూ నిలబడే ఉంటానని తేల్చి చెప్పారు.

నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా, సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని కోటంరెడ్డి ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లోనే తాను నిరసనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. రూరల్ నియోజక వర్గంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, జగనన్న కాలనీలో కనీస వసతులు, ఇరిగేషన్ కాల్వలకు మరమ్మతులు, ముస్లిం గురుకుల పాఠశాల, బారాసాహెబ్ దర్గా సమస్యలపై గతంలో చాలా సార్లు ముఖ్యమంత్రికే నేరుగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు.

ప్లకార్డులు ప్రదర్శించడం సభ్యుడిగా తనకు ఉన్న హక్కని కోటంరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డును ప్రదర్శిస్తూ పాదయాత్రగా అసెంబ్లీకి తరలి వచ్చారు. నియోజక వర్గంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని, పొట్టేపాలెం, ములుముడి కాలువల మీద వంతెన నిర్మాణం చేపట్టాలన్నారు.

ఎన్టీఆర్‌ నెక్లెస్ రోడ్డులో గణేష్ ఘాట్‌ను అభివృద్ధి చేయాలని, నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బారాషాహీద్ దర్గా అభివృద్ధితో పాటు మసీదు నిర్మాణం పూర్తి చేయాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన షాదీమంజిల్ పనులు పూర్తి చేయాలని కోరారు. ఆమంచర్ల పెద్ద పారిశ్రామిక వాడ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కొమ్మరపూడి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

నియోజక వర్గంలో అంబేడ్కర్ భవన్ కమ్ స్టడీ సర్కిల్ నిర్మించాలని, బిసి భవన్, కాపు భవన్‌ నిర్మాణాలను పూర్తి చేయాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాళెం, డొంకాని గ్రామాల్లో ఇరిగేషన్ లిఫ్ట్ పథకాలను పూర్తి చేయాలన్నారు. వేలాల వ్యవసాయభూములకు సాగునీటి కోసం అమంచర్ల డీప్‌కట్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలు, దళితులకు గురు కుల పాఠశాలల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాలు కల్పించాలంటూ కోటంరెడ్డి ప్లకార్డును ప్రదర్శించారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్