
జనసముద్రం న్యూస్,ఏప్రిల్04,
పుట్లూరు/శింగనమల.శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన YSR ఆసరా మూడవ విడత కార్యక్రమములో శింగనమల శాసన సభ్యులు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు, ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ రాజకీయంగా, ఆర్థికంగా మహిళల పెద్ద పీఠ వేస్తూ జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పనిచేస్తున్నదని, మహిళలు అందరు జగనన్న కు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో YSRCP జిల్లా అధ్యక్షులు శ్రీ పైలా నరసింహయ్య గారు, స్థానిక ZPTC, MPP, వైస్ MPP, MPTCలు,సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు,YSR పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.







