
ప్రజలకు తెలియజేయాలని బిజెపి పల్లె పల్లెకు ప్రచారం..
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 03
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మల్కాజిగిరి అసెంబ్లీ
నియోజకవర్గం పులపల్లి బాలయ్య కాంప్లెక్స్, కార్యాలయం లో
బిజెపి ఓబీసీ మోర్చా కన్వీనర్ చింతకుంటా విటోభ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే ఏప్రిల్ 06 నుండి 14వ తేదీ వరకు నిర్వహించే పల్లె పల్లెకు బిజెపి ఇంటింటికి ఓబిసి కార్యక్రమం గురించి చర్చించాడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలో రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేంద్రంలో ఓబీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వసంశెట్టి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంగేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ యాదవ్, ఆనంద్ గౌడ్, రాష్ట్ర ఆర్.టి.ఐ సెల్ కన్వీనర్ ఆర్.మణి రత్నం, జిల్లా నాయకులు సర్వేష్ యాదవ్, లక్ష్మీ నారాయణ ముదిరాజ్, అసెంబ్లీ కోకన్వీనర్ కిరణ్, కృష్ణ, అంజలీ యాదవ్, అనురాధ, అక్షయ్ గౌడ్, సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





