
పాఠశాల అగ్ని ప్రమాదంలో గాయపడ్డ బాలుడి ఫిర్యాదు బయటికి వచ్చి స్వయంగా స్వీకరించిన కమిషనర్ డి.ఎస్ చౌహాన్ ఐ పి ఎస్
మల్కాజ్గిరి జనసంద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 03
ఫిబ్రవరి నెలలో చేర్యాల గ్రామ పరిధిలోని ఓ ప్రముఖ గురుకుల పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ 6వ తరగతి బాలుడు తుమ్మల హనివర్ధన్ నుండి కమిషనర్ స్వయంగా తన చాంబర్ నుంచి బయటికి వచ్చి ఫిర్యాదు స్వీకరించారు. బాలుడి వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల మేనేజ్మెంట్ మీద చట్ట ప్రకారం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్న పిల్లల పరిరక్షణ కోసం రాచకొండ కమిషనరేట్ ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. బాలుడికి తోడుగా అతని చిన్నాన్న నరేష్ రెడ్డి వచ్చారు.





