
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, ఏప్రిల్ 3.
పినపాక, గోపాలరావుపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన బి ఆర్ ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో పినపాక నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఏప్రిల్ 5 నుండి ప్రారంభం కానున్నాయని మొట్టమొదటి ఆత్మీయ సమ్మేళనం పినపాక మండలం నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5 బుధవారం రోజున కలవల నాగారం రాళ్లవాగు వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోయే ఆత్మీయ సమ్మేళన సభకు మండలంలోని 12 పంచాయతీల నుండి ముఖ్య కార్యకర్తలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. ప్రతి పంచాయతీ నుండి 150 మంది ముఖ్య కార్యకర్తలు కదలిరావాలని,బుధవారం బయ్యారం నుండి రాళ్లవాగు వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందని ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్,పినపాక ఎంపీటీసీ చింతపంటి సత్యం, స్థానిక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, కటకం గణేష్, ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి సభ్యులు దొడ్డ వెంకటేశ్వర్లు ,బూరా సురేష్ ,ఎల్లు సత్తిరెడ్డి, గొట్టేముక్కల స్వతంత్ర రెడ్డి, ఆత్మ కమిటీ సభ్యులు సూర నరసింహారావు, గొగ్గల బజారు,జలగం రాములు , బండారు సమ్మయ్య,యాత్ లీడర్ అంకతి సతీష్, కేప సతీష్, ఊడుగుల రామచంద్రు, బూత్ కమిటీ అధ్యక్షులు కొంపెల్లి మల్లేష్, కొంపెల్లి నగేష్, జలగం అశోక్, అనిపెద్ది బాబురావు, గోరెంట్ల శ్రీనివాస్, పిట్టల రవి, పసల నారాయణ,కునారపు సత్యనారాయణ, అనిపెద్ది జంపయ్య,ఉప్పలి సతీష్, తదితరులు పాల్గొన్నారు.





