
10వ తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్ళి వసతులపై ఆరా.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ జన సముద్రం న్యూస్ 03
కుషాయిగూడ ఈ రోజున నుంచి 10 వ తరగతి పరీక్షలు మొదలు అయ్యాయి.ఈ సందర్భంగా చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ కుషాయిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు.త్రాగునీరు మరియు తదితర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.ఈరోజు మొదటి పరీక్ష పూర్తి అయిన అనంతరం విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు.పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దని ఇష్టపడి చదివేలా చూడాలని అన్నారు.పిల్లలందరికి మిగతా అన్ని పరీక్షలు బాగా రాయలాంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బాల్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,కనక రాజ్ గౌడ్,శ్రీకాంత్ యాదవ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు







