
జన సముద్రం న్యూస్, మార్చి 31
రాచకొండ పోలీసు కమిషరేట్ లోని కీసర పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎండీ. ఖలీద్ ఈ రోజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. LB Nagar లోని సిపి క్యాంప్ ఆఫీస్ లో రాచకొండ కమిషనర్ శ్రీ డి.ఎస్. చౌహాన్, ఐపిఎస్., గారు ఖదీర్ ను సన్మానించారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ… ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘ కాలంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ఖలీద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. రిటైర్ మెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాలన్నారు.ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బెనిఫిట్ ఫండ్ క్రింద 30,000/- రూ మరియు సొసైటీ పొదుపు మొత్తాన్ని 1,12,964/- రూ చేకులను సీపీ గారు ఖలీద్ కు అందచేశారు.
ఈ కార్యక్రమంలో సీపీ గారితో పాటు డీసీపీ అడ్మిన్ పి. ఇందిర, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్ భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, రవుఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.





