అనర్హత వేటు రాజ్యాంగ విరుద్ధం: డాక్టర్ చందా సంతోష్.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 28.

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ,డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాల మేరకు మణుగూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పీరీనాకి నవీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపట్టిన టిపిసిసి సభ్యులు డాక్టర్.చందా సంతోష్ కుమార్, పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులకు పూలమాలలను మాజీ జడ్పీ చైర్మన్, ఎక్స్ ఎమ్మెల్యే చందా లింగయ్య వేసి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ దేశ ఐక్యత,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు “భారత్ జోడో యాత్ర” చేపట్టడంతో వచ్చిన ప్రజా ఆమోదాన్ని జీర్ణించుకోలేక వయనాడ్‌ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అనేది బిజెపి చేస్తున్న కుట్ర అని అన్నారు.ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మోడీ నుండి ఈ దేశాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తారన్నారు.రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటు రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమే అని,రాహుల్ గాంధీ పార్లమెంట్ అనర్హత వేటు ను తిరిగి వెనుకకు తీసుకొని యెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు,పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు మండలంలో చేపట్టిన సంకల్ప సత్యాగ్రహ దీక్షకు సిపిఐ ,టిడిపి, వైయస్సార్ టి పి తో పాటు పలు రాజకీయ పార్టీలు, తుడుం దెబ్బ నాయకులు తమ సంఘీభావాన్ని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి , సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి ,ఆవుల సర్వేశ్వరరావు ,కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ,పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం,అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి బీక్షమయ్య ,బీ బ్లాక్ అధ్యక్షురాలు బర్ల నాగమణి ,కరకగూడెం మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, నియోజకవర్గ మహిళా నాయకురాల్లు బోగినేని వరలక్ష్మి, గొంది రాధ ,నియోజకవర్గ , మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి