ఆదివాసీల అభివృద్ధికి మొండి చెయ్యి : వజ్జ జ్యోతిబసు.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి,డి.శ్రీనివాస్ ,మణగూరు, మార్చ్ 28.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాల పట్ల, ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదని ఆదివాసీల యొక్క ప్రజాభిప్రాయ సేకరణ లేకుండ 11 కులాలు కలపడం రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసీ సేన జిల్లా ఉపాధ్యక్షులు వజ్జ జ్యోతి బసు అన్నారు.ఈ మేరకు మణుగూరు మండలంలో ఆదివాసీసేన ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నాగరాజు అధ్యక్షుతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వజ్జ జ్యోతిబాసు పాల్గొని మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారo లోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల యొక్క మనుగడును ప్రశ్నించే విధానాలను అవలంబిస్తుందని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎస్టీలకు10% రిజర్వేషన్ పేరుతో జీవో తీసుకొచ్చి గిరిజనులు కానీ కులాలను తెగలు లో కలిపారని, ఐదో షెడ్యూల్ ప్రాంతాల చట్టాలు నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదివాసులు అభివృద్ధికి, ఉపాధికి మొండి చేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి,కేటీపీఎస్,బిపిఎల్, నవభారత్, బి టి పి ఎస్, తెలంగాణ జెన్కో, టూరిజం, ఇసుక సొసైటీలు తదితర పరిశ్రమల్లో ఎంతమందికి ఉపాధి కల్పించారో తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బహుళార్థకసాధక సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు ఎటువంటి పరిహారం నిర్వాసితులకు ఇవ్వలేదని, పర్యావరణ అనుమతులు విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పలు సందర్భాల్లో ఫిర్యాదులు చేయగా రాష్ట్ర ప్రభుత్వం పైన మొట్టికాయలు వేస్తూ స్టే ఇచ్చిందని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలని తెలంగాణ ప్రభుత్వం అరెస్టులు చేయడం ద్వారా ప్రజల్ని భయభ్రాంతులను గురిచేస్తుందని ఈ చర్యలను ప్రజాస్వామిక వాదులు హర్షించరని తెలిపారు. జీవో నెంబర్.3 రద్దయినప్పటికీ, నేటి వరకు ఎలాంటి ఆదివాసుల ఉద్యోగాల కోసం కోసం కొత్త జీవోలు తీసుకురాలేదని గుర్తు చేశారు. గిరిజనేతరుల వలసలు అడ్డుకోలేని ప్రభుత్వం గిరిజన చట్టాలు రద్దు చేయాలని ఏజెన్సీలోని గిరిజనేతరులతో ప్రదర్శన నిర్వహిస్తూ కోర్టులో పరోక్షంగా కేసులు తెలంగాణ ప్రభుత్వం వేయిస్తుందని విమర్శించారు.లీగల్ ఎయిడ్ నిధులు కూడా ఐటీడీఏలకు మంజూరు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఆ చర్యలు నుండి తప్పుకుంటుందని ఫలితంగా సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై దృష్టికి శ్రీరామనవమికి విచ్చేస్తున్న సందర్భంగా ఆదివాసి సేన, తెలంగాణ ఆదివాసి సంఘాలు రాష్ట్ర బృందం తరపున వినతి పత్రాలు అందిస్తామని జిల్లా ఉపాధ్యక్షులు వజ్జ జ్యోతిబసు తెలిపారు. ఈ సమావేశంలోఆదివాసీ సంఘాల నాయకులు జిల్లా, మండల నాయకులు గనిబోయిన ముత్తయ్య పుణ్యం నాగరాజు బండారి కృష్ణ గనిబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి