దగడపల్లి to తూముకుంట రోడ్డు ప్రభుత్వ నక్స ప్రకారం రోడ్డు వేయాలి

Spread the love

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం జనసముద్రం ప్రతినిధి శ్యాం మార్చి 27

చిన్నంబావి మండల పరిధిలోని దగడపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన తూముకుంట నుండి దగడపల్లి కి బీటీ రోడ్డు నిర్మాణంలో పట్టా భూములు కోల్పోతున్నామని పూర్వం నుండి గ్రామానికి ఆయకట్టు రోడ్డు గా ఉన్న బండ్ల బాటను భూ సర్వే రికార్డు ప్రకారమే కొనసాగాలని పట్టా భూములు కోల్పోతున్న దగడపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతులు ఓడే పద్మమ్మ, ఓడే శివయ్య, ఓడే మల్లయ్య, ఓడే శీను, ఓడే వెంకటేశ్వర్లు పత్రిక ముఖంగా అధికారులను కోరారు.
దగడపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 139 లో గల ఐదు ఎకరాల భూమిని వారి కుటుంబానికి చెందిన సొంత పట్టా భూమిలో భూ సర్వే నక్స టిఫన్ ప్రకారం రోడ్డు నిర్మించకుండా కొందరు ఇష్టానుసారం రైతుల పట్టా భూముల్లో నూతన రోడ్లు నిర్మిస్తున్నారని దీంతో రైతులకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తుందని గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం నక్స బాటను రోడ్డుగా పరిగణించి బీటీ రోడ్డును నిర్మించాలని వారు కోరారు.
గతంలో ఆయకట్టు రోడ్డు అంటూ వారికి చెందిన 139 సర్వేనెంబర్ లో గల ఒక్కొకరికి 1.00 ఎకరా పట్టా భూమి మొత్తం ఐదు మంది కి కలిపి ఐదు ఎకరాల భూమిలో మట్టి రోడ్డు నిర్మించడానికి రాగా వ్యతిరేకించడం జరిగిందని మళ్లీ నేడు బీటీ రోడ్ నిర్మాణానికి మొత్తం ఎకరా భూమిని కోల్పోతున్నామని ఇది రెవెన్యూ అధికారులు మరియు ఆర్ అండ్ బి అధికారులు గుర్తించి గ్రామంలో మరికొంతమంది రైతులకు కూడా అన్యాయం జరగకుండా చూడాలని వారు కోరారు. ఇటీవల నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి 4 కోట్ల 50 లక్షలు విడుదల కావడంతో గ్రామంలోని రైతులు ముక్తకంఠంగా నక్స ప్రకారమే రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టా భూములు కోల్పోతున్న రైతులను సైతం ప్రభుత్వం పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి