
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 24 :
మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో…బైక్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న హెచ్ జి 275 శేఖర్ రెడ్డి కి మొబైల్ ఫోన్ దొరకగా… మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై కోటేశ్వర్ కు అప్పజెప్పడం జరిగింది. ఈ మొబైల్ ను ఫోన్ నెంబర్ ద్వారా… మొబైల్ పోగొట్టుకున్న మహిళకు ఎస్సై మొబైల్ ఇవ్వడం జరిగింది.. డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తున్న హెచ్ జి 275 శేఖర్ రెడ్డి ని ట్రాఫిక్ ఎస్సై కోటేశ్వర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు తదితరులు అభినందించడం జరిగింది.





