
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 24 :
మిర్యాలగూడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం… 2023 సంవత్సరం మార్చి 24న జాతీయ పంచాయతీ అవార్డులు “దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతాత్ వికాస్ పురస్కార్” మండల స్థాయి అవార్డులు గ్రామపంచాయతీ సర్పంచులకు, కార్యదర్శులకు … బహూకరణ ప్రదానోత్సవ కార్యక్రమం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నూకల సరళ హనుమంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశములో ముఖ్య అతిధులు… మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయ సింహారెడ్డి పీఏసీఎస్ అలగడప చైర్మన్ వి.రామకృష్ణ లు పాల్గొనడం జరిగింది.
అవార్డులు పొందిన గ్రామపంచాయతీలు… శ్రీనివాస్ నగర్, ధీరా వత్ తండా ,యద్గార్ పల్లి, కురియ తండా, రాయిని పాలెం, లక్ష్మిపురం, వెంక టాద్రిపాలెం,వాటర్ ట్యాంక్ తండా, మొత్తం” తొమ్మిది గ్రామ పంచాయతీలు జాతీయ పంచాయతీ అవార్డులు ” పొందాయి.
ఈ సమావేశనికి నూకల సరళ హనుమంత రెడ్డి.. అవార్డులు పొందిన గ్రామపంచాయతీ సర్పంచ్ లు, కార్యదర్శులకు … మెమొంటోలు అందజేసి శాలువాతో సత్కరించడం జరిగింది . ఈ సమవేశములో మండలం ఎంపీడీవో గార్లపాటి జ్యోతి లక్ష్మి , మండల పంచాయతీ అధికారి కె.మాధవ రెడ్డి, ఎంపీటీసీలు , సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, కార్యాలయఅధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





