
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి శ్రీనివాస్, పినపాక, మార్చి 23.
వాహనదారులు,ప్రయాణికులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏడూళ్ల బయ్యారం సిఐ బి రాజగోపాల్ గురువారం డ్రైవర్లకు ప్రయాణికులకు స్పెషల్ డ్రైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో వాహనదారులతో మాట్లాడుతూ
ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
ఆటోలు, ట్రాక్టర్లు, లారీల డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ తోపాటు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. వాహనాలు నడేపేటప్పుడు మద్యం సేవించరాదని అవగాహన కల్పించారు.ఇటీవల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు మద్యం సేవించి నడుపుతున్న వాహనాలలో ప్రయాణించవద్దని సూచించారు. ప్రయాణంలో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా 100 కి సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





