
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 23
సిఐటియు. మల్కాజ్గిరి మండల ప్రాంతం ఓల్డ్ పిఎస్, నేరేడుమెట్, డైట్ సెంటర్ పక్కన ఆటో మరియు ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు జెండావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జె. చంద్రశేఖర్ గారు హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సిఐటియు కార్యదర్శి జె . చంద్రశేఖర్ మాట్లాడుతూ…. సిఐటియులో చేరిన ఆటో మరియు ట్రాలీ డ్రైవర్స్ కు ముందుగా అభినందనలు తెలియజేశారు . రవాణా రంగం కార్మికుల సమస్యలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం గాని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఉన్నట్టుగానే, రవాణా రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు .ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్స్ అందరికీ ఈఎస్ఐ సౌకర్యంతో పాటు హెల్త్ కార్డులు అందజేయాలన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ (2013)ను సవరంచాలని ,అర్హులైన డ్రైవర్స్ అందరికీ బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసి ,ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలన్నారు . ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలనీ. అదేవిధంగా ఆటో ట్రాలీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ పై ఆర్టిఏ అధికారుల వేధింపులు ఆపాలని , ట్రాఫిక్ పోలీసుల ఫైన్సును నియంత్రించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుందని అందులో భాగంగానే ఏప్రిల్ 5న చలో ఢిల్లీ మజ్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీని కార్మికులందరూ జయప్రదం చేయాలన్నారు . ర్యాలీలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ నాయకులు , మల్కాజ్గిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగ రావు మాట్లాడుతూ ఆటో ట్రాలీ ట్రాన్స్పోర్ట్ రంగా కార్మికుల కు సిఐటియు అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రవాణా రంగ కార్మికులందరికీ వర్తింపజేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మల్కాజ్గిరి నాయకులు ఎర్రోళ్ల సుమిత్ర, బి. కొండల్ , కేవిపీఎస్ నాయకులు గుంటి లక్ష్మణ్, బీసీ డబ్ల్యూ నాయకులు కే. యాదగిరి , మున్సిపల్ రంగం కే. నాగరాజు మరియు సిపిఎం మండల కార్యదర్శి ఎం కృపా సాగర్ లను ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో& ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు శేఖర్, మహేష్, శ్రీకాంత్, రజనీకాంత్, శ్రీనివాస్, బాబు, ఉమేష్, నరేష్, వెంకటేష్ , ప్రశాంత్ మరియు నవీన్
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జే . చంద్రశేఖర్ షాహిద్ భగత్ సింగ్ 92 వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది..
.





