
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,మార్చి 23.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ గుమ్మడి.అరుణ ఆధ్వర్యంలో పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఆయుష్ న్యూట్రిషినల్ కిట్, అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గుమ్మడి గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థినులకు పోషకాహారంగా రాగిలడ్డూలు,మెమరీ బూస్టర్ ,బ్రహ్మీ గ్రాన్యూల్స్ , రాగిలాడ్డులు ని అందచేశారు. విద్యార్థులనుద్దేశించి రాగిలాడ్డులు ఆడపిల్లల్లో కలిగే రక్తహీనత విద్యార్థినులలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు అని వివరించారు.సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం యొక్క విశిష్టతను, జీవనశైలి మార్పుల వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించి ఆయుష్ ఆరోగ్యకర దీపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గా ఎంపీపీ గుమ్మడి.గాంధీ, పినపాక బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, దాట్ల వాసు బాబు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, దొడ్డ శ్రీనివాసరావు,బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు ఆయుష్ స్టాప్ .జి రాధిక. పాఠశాల ఉపాధ్యాయులు , పాల్గొన్నారు.





