
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె, మార్చి 22:
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పంట నష్టం వాటిల్లిందని… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని రైతు కుటుంబాలను… ఆదుకోవాలని లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ..
ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి పలుచోట్ల నష్టం వాటిల్లిందని, ముఖ్యంగా పొట్టదశలో ఉన్న వరి పంటతోపాటు మామిడి, నిమ్మ తోటలపై ఎక్కువ ప్రభావం పడింది.వరి నేల వాలడంతోపాటు పండ్ల తోటల్లో కాయలు,పండ్లు నేలరాలాయని అన్నారు.అకాల వర్షం కారణంగా జరిగిన నష్టంతో రైతులు ఆందోళనలో ఉన్నారని అన్నారు.ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈమెయిల్ ద్వారా లేఖలో జాజుల లింగం గౌడ్ విజ్ఞప్తి చేశారు.





