
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్, మార్చి 22 :
“సోనా లెదర్ వర్క్ షాప్ “శెట్టర్ కట్ చేసి అందులోని లోని విలువైన సరుకును… తరలించిన వారి పై చర్యలు తీసుకోవాలని శాంతి నగర్ నివాసి సయ్యద్ అబ్రర్ ఆదివారం కోరారు.
బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో సయ్యద్ అబ్రర్ విలేకరులతో మాట్లాడుతూ..
షాప్ యజమానితో వివాదం కేసు కోర్టు పరిధిలో ఉండగా… మార్చి 14న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… “సోనా లెదర్ వర్క్ షాప్ “శెట్టర్ తీసి అందులోని 35లక్షల విలువైన సరుకు , మూడున్నర లక్షల నగదు ఎత్తు కెళ్ళినట్లు ఆరోపించారు. షాపులో సరుకు మాయమవుతుందని ముందే గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ షాపు ఖాళీ చేయమని చెప్పుతున్నారని, కొన్ని సందర్భాల్లో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై టూ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేశానని ఈ సంఘటన గురించి విచారించి” న్యాయం” చేయాలని అబ్రర్ కోరారు.





