ప్రాణాలు పణంగా పెట్టి విద్యుత్ ఉద్యోగాలు చేస్తున్నాం…మార్చి 24న ఛలో విద్యుత్ సౌదా కార్యక్రమమును విజయవంతం చేయండి: పిఆర్సి జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 21:

తెలంగాణ స్టేట్ విద్యుత్ ఉద్యోగుల పిఆర్సి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు “ఛలో విద్యుత్ సౌధ” 2023 సంవత్సరం మార్చి 24 శుక్రవారం చేపట్టిన కార్యక్రమం ను యూనియన్లు, ఇంజనీర్ సంఘాలు, కుల సంఘాలు… విజయవంతం చేయాలని మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ కార్యాలయం నందు పిఆర్సి జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్, సోమాచారి, ఆంజనేయులు, కిషన్ లాల్, రవీందర్ రెడ్డి, సీతారామారావు… సమక్షంలో భోజన విరామ సమయం లో ఉద్యోగులందరూ….వాల్ పోస్టర్లు రిలీజ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ సందర్భంగా పిఆర్సి జేఏసీ నాయకులు మాట్లాడుతూ..

విద్యుత్ ఉద్యోగులకు తక్షణమే మేనేజ్మెంట్ పిఆర్సి ప్రకటించాలని, ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ తోపాటు పాటు ఆర్టిజన్ వారికి మిగతా ఉద్యోగుల జీతాలు లాగానె పరిష్కరించాలని, సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేయాలని, విద్యుత్ సంస్థలలో… మీటర్ రీడర్స్, పిసిఏలు, ఎస్ పి ఎం, లైన్ మ్యాన్ కార్మికులు… “విద్యుత్ సంస్థలొ ఆరు వేల కార్మికులను ఉద్యోగులుగా “ప్రకటించాలని మరియు ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యోగులంతా ఐక్యతతో మార్చి 24 న మిర్యాలగూడ డివిజన్… లో ఉన్న సబ్స్టేషన్లొ ఆపరేటర్ తప్ప మిగతా ఉద్యోగులందరూ… వ్యక్తిగత సెలవు పెట్టి ఉదయం ఏడు గంటలకు ఎవరికివారు … “హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద 10 గంటల వరకు భారీ ఎత్తున ఉద్యోగులు చేరుకోవాలని “పిఆర్సి జేఏసీ కి సహకరిస్తూ విజయవంతం చేయాలని కోరారు. వినియోగదారులకు, రైతులకు… విద్యుత్ శాఖ తరపున మీకు విన్నవించుకుంటున్నాం. విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు… మేనేజ్మెంట్ సంవత్సరం నుండి కాలయాపన చేసుకుంటూ రావడం జరిగింది.మేనేజ్మెంట్ వారు…తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు..విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేయకపోవడం వలన రాష్ట్ర పిఆర్సి జేఏసీ సంవత్సరం నుండి దరఖాస్తుల ద్వారా, నల్ల బ్యాడ్జీల నిరసనలతో మేనేజ్మెంట్ కు తెలియజేయడం జరిగినది అన్నారు. మేనేజ్మెంట్ మొండి వైఖరి వలన “ఛలో విద్యుత్ సౌద” కార్యక్రమాలు చేపట్టడం జరిగినది, ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తు ప్రకటించిన… “విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులకు, రైతులకు 24 గంటలు ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా కరెంటు ఇస్తున్నాం” విద్యుత్ ఉద్యోగుల మీద దయ ఉంచి సహకరించగలరని కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో జేఏసీ డివిజన్ నాయకులు ఎడిఈ రవీందర్ రెడ్డి, ఎఈలు శ్రీనివాస్, హడావత్ బాలు, శ్రీకాంత్ రెడ్డి, ఎం నిఖిత, ఉదయ్ కుమార్, వెంకట్ రెడ్డి.. లు,ఉద్యోగులు రాజేశ్వరరావు, బచ్చు రామ్ చందర్, హరికిషన్.. లు,సబ్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, ఉదయ చారి, నరసింహ చారి, మనోహర్, గోపికృష్ణ, గంజి పాండు, శ్రీనివాసరావు, నాగమణి, పి వెంకటేశ్వర్లు, సుజిత్, అమర్నాథ్, సురేష్, భాస్కర్, శ్రీకాంత్, కృష్ణ, శ్రీరాములు, నరసింహారావు, అశోక్, అనిల్, హేమెంధర్, శ్రీధర్, విజయ శేఖర్, ఇమ్రాన్ ఖాన్, రషీద్ భాయ్, రామ్మూర్తి, కిరణ్, హరి, ఇక్బాల్, శ్రీనయ్య, బిక్షం, సురేష్, నాగమణి, ఝాన్సీ, అంజు ఫాతిమా, సుగుణమ్మ, అనసూర్య, జరీన, భార్గవి, ఫాతిమా, రామకృష్ణ, వెంకట్ రత్నం, వేణు, కోటేష్, మనోజ్, రాముడు, సైదులు.. లు, తదితర విద్యుత్ కార్యాలయ ఉద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి