సంఘవిద్రోహశక్తులకు సహకరించవద్దు -ఎస్సై నాగుల్ మీరా ఖాన్.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, మార్చి 21.

సంఘవిద్రోహ శక్తులకు సహకరించరాదని ఏడుల్ల బయ్యారం ఎస్సై నాగుల్ మీరా ఖాన్ అన్నారు. మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన ఎర్రగుంట, సుందరయ్య నగర్ ఆదివాసి గ్రామాలలో పోలిసింగ్ లో భాగంగ చిరు వ్యాపారులను, యువకులను కలిసి వారి మంచి చెడ్డలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఏజెన్సీలోని ఆదివాసీలు యువత బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ, పోలీస్ శాఖ , వివిధ శాఖలలో ఉపాధి,ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని ఆదివాసి గిరిజన యువత అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడాలన్నారు.కాలం చెల్లిన సాంప్రదాయాలతో మావోయిస్టు పార్టీ ఏజెన్సీ అభివృద్ధికి ఆటంకంగా మారిందని ఎట్టి పరిస్థితిలోనూ మావోయిస్టు పార్టీలకు విప్లవ గ్రూపుల కైనా సహకరించొద్దని, సహకరిస్తే ఎంతటి వారైనా చట్టరీత్యా శిక్షార్హులౌతారని, జీవితాలు ఆగమైపోతాయని తెలిపారు.ఏజెన్సీలోని ఆదివాసీలకు ఎలాంటి అవసరాలైన పోలీస్ శాఖ నుండి ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందుతాయన్నారు. మీకు ఇలాంటి సమస్యలున్న మా దృష్టికి తీసుకువస్తే వివిధ శాఖల అధికారులతో సమన్వయపరిచి మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దిలీప్ కుమార్,పోలీస్ సిబ్బంది, టీఎస్పీఎస్సీ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి