సేవ్ మంకీస్ ఫీడ్ మంకీస్ కార్యక్రమానికి నేటికీ ఐదు సంవత్సరాలు పూర్తి

Spread the love

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: మార్చ్ 21

సృష్టిలో మనుషులతో పాటు నోరులేని జీవాలకు కూడా ఆకలి అనేది సహజం… మనుషుల చుట్టూ ఉన్న జంతువులకైతే ఎలాగలో తినడానికి ఆహారం అందుతుంది,కానీ అడవుల్లో ఉన్న వానరులకు ఆహారం దొరకక పల్లెలు పట్టణాల వైపు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వానరులకు ఏదైనా చేయాలని ఆలోచనతో ఐదు సంవత్సరాల క్రితం సేవ్ మంకీస్ ఫీడ్ మంకీస్ అనే నినాదంతో మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు,ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాట్స్అప్ గ్రూపు సభ్యుల సహకారంతో ప్రతి నెల ఒక రోజు అందుబాటులో ఉన్న సభ్యులతో కలిసి మల్కాజ్గిరి నుండి నర్సాపూర్ అడవికి వెళ్లి వానరులకు ఆహారం అందివ్వడం జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రూప్ సభ్యులు అహ్మద్ అలీ ఖాన్, ఫణి కుమార్, శ్రీనివాస్ చారి,అయ్యంగార్ బేకరీ చిన్నస్వామి గార్ల సహకారంతో అరటి పండ్లు బ్రెడ్ ఆహారంగా అందివ్వడం జరిగింది.ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు మాట్లాడుతూ ఈ మార్చి నెలతో వానరులకు ఆహార అందించే కార్యక్రమం చేపట్టి సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి గత ఐదు సంవత్సరాల నుంచి సహకరిస్తున్న గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, శ్రీనివాస్ చారి, బాలరాజు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి