పేదింటి ఆడపడుచుకు పెద్దన్న కేసీఆర్: ఎంపీపీ గుమ్మడి గాంధీ.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్ ,పినపాక, మార్చి 21.

తెలంగాణ ముఖ్యమంత్రి పేదింటి మేనమామ లాగా ఆడబిడ్డల కళ్యాణం కోసం కళ్యాణ లక్ష్మి రూపంలో ఆర్థిక సాయం చేస్తున్నాడని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఈ మేరకు 24 కల్యాణ లక్ష్మి చెక్కులు పినపాక మండల పరిధిలోని పినపాక, పోట్లపల్లి సీతంపేట, గోపాల్ రావు పేట, తదితర గ్రామాలలోని లబ్ధిదారులకు మంజూరు అవ్వగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. జానంపేట పరిధిలో పది కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరవగా రైతు వేదికలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి తెలంగాణ ఆడబిడ్డల వివాహానికి భరోసా అని తెలియజేశారు. లబ్ధిదారులు ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి సాయాన్ని మరువలేరని, ఆయనను దైవం మాదిరిగా పూజిస్తున్నారని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు అర్హులకు సహకరిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, భవాని శంకర్, బుల్లిబాబు, కామేశ్వరరావు, బత్తుల వెంకటరెడ్డి, ఆర్ఐ బాలకృష్ణ, వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి