అన్నదాతల పంట అకాల వర్షం పాలు: పినపాక మండల కాంగ్రెస్ పార్టీ.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, మార్చ్ 21.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం ఆధ్వర్యంలో మండలంలోని శేగరశల, దుగ్గినేపల్లి, రెడ్డిగూడెం గ్రామాలల్లో పిసిసి సభ్యులు చక్రవర్తి, చందా సంతోష్, కాటబోయిన నాగేశ్వరరావు, దుర్గంపూడి రామకృష్ణారెడ్డి, కనితి కృష్ణ పర్యటించి నిన్న కురిసిన వడగండ్ల వానకు తడిసిన మిర్చి కల్లాలను, పంట పొలాలను రైతులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ కాయ కష్టం చేసి లక్షల్లో అప్పుచేసి మిర్చి పంటను సాగు చేయడం జరుగుతుందని గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మిర్చి కల్లాలన్నీ తడిచి వరదకు కొట్టిపోయి తీవ్ర నష్టంలో అన్నదాతలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటల బీమా ఉండేదని ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడేదని తెలిపారు.కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని రైతులకు అమలు చేయడం లేదని, ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు జరిగిన నష్టాన్ని అంచన వేసి దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కాపాడాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున రైతుల పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని, రైతులెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.వెంటనే కేసీఆర్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీను, యాలం బుజ్జిబాబు, గొంది రాధా, పొనగంటి సమ్మయ్య, రైతులు పోకల కృష్ణారావు, శ్రీను, పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, రైతు కూలీలు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి