మహిళా సాధికారతలో సెర్ప్ పాత్ర ఎంతో కీలకం: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి.శ్రీనివాస్, కరకగూడెం, మార్చి 21.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, సమత్ భట్టుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుని వారి స్వగృహమైన కుర్నవల్లి గ్రామంలో సెర్ప్ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చo అందజేయడం జరిగింది. అనంతరం సెర్ప్ ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించినందున ఉద్యోగులకు జీవో నెంబర్ 11 వర్షింపచేస్తూ పే స్కేలు అమలు చేసినందుకు సీఎం కెసిఆర్ చిత్రపటానికి ఉద్యోగులతో కలిసి క్షీరాభిషేకం కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ 25 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 3974 మంది తాత్కాలిక సెర్ప్ ఉద్యోగులు గా ఎనలేని సేవలు అందిస్తున్నారని, 46 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. వీరి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ స్పందించి చిరకాల కోరికను తీర్చి వారి కుటుంబాలలో వెలుగు నింపారన్నారు.ఉద్యోగులంతా మరింత ఉత్సాహంతో పేదరిక నిర్మూలనకు మహిళా అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక, సెర్ప్ జేఏసీ నాయకులు బచ్చలకూరి ప్రసాద్,మడిపల్లి నాగార్జున రావు,గుజ్జుల రాధా రెడ్డి,త్రిగుణ, మురళి, గిరి బాబు,ఆహ్మదుల్లా, ఝాన్సీ,శోభా, లక్ష్మి కాంత, సత్యనారాయణ, రాంకుమార్, రమేష్ , కళావతి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి