సమాచార హక్కు చట్టమా ! నీ ఆచరణ ఎక్కడ…?

Spread the love

*సమాచారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్న పినపాక రెవిన్యూ అధికారులు.

• త్వరలో రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామంటున్న ఆదివాసి సేన పినపాక మండల కమిటీ.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి.శ్రీనివాస్,పినపాక , మార్చి 18.

ప్రభుత్వ శాఖల్లో పని తీరును తెలుసుకునేందుకు పేదవాడికి సత్వర సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఆలస్యం అవుతుంది.ముఖ్యంగా కొన్ని శాఖల అధికారుల పనితీరు ఈ చట్టం అమలు చేయడంలో దరఖాస్తు లబ్ధిదారులకు సమాచారం ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు సమాచారం 30 రోజుల్లోకి ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొంతమంది అధికారుల తీరుతో మరింత ఆలస్యం అవుతుంది.

సమాచారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్న పినపాక రెవిన్యూ అధికారులు:

పినపాక రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయల్లో నెలల తరబడి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సమాచారం ఇవ్వడంలో రెవిన్యూ శాఖ ,ఎంపీడీవో శాఖ అధికారులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారు .దరఖాస్తు చేసుకున్న బాదితుడికి 30 రోజుల్లో సమాచారం ఇవ్వలేదని సెకండ్ అపిల్ కు వెళ్లినా కూడా సమాచారం ఇవ్వని పరిస్థితి. పినపాక మండల పరిధిలో రెవెన్యూ , ఎంపీడీవో ఆఫీస్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో సమాచారం కొరకు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సమాచారం ఇవ్వని పరిస్థితి. సమాచార చట్టం కొరకు అధికారులను నియమించిన వారు గోడ మీద బోర్డులకే పరిమితమయ్యారు. 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం మూడు నెలలు గడిచిన ఇవ్వటం లేదు.దీనిని బట్టి పినపాక మండలంలోని అధికారులకు సమాచారం హక్కు చట్టం పట్ల ఉన్న నిబద్ధత ఎంతో అర్థమవుతుంది. సమాచారం ఇవ్వకుండ ఉండడంలో మండల రెవెన్యూ ,ఎంపీడీవో కార్యాలయాలు ఏ ఒక్క కార్యాలయం సమాచారం ఇచ్చిన రెండవ కార్యాలయం అవినీతి బయటపడుతుందని ఈ రెండు కార్యాలయాలు అవినాభావ సంబంధంతో అడిగిన సమాచారం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పినపాకలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను బయటకు తీసుకువచ్చే వరకు ఆదివాసి సేన మండల కమిటీ ఉద్యమం చేస్తుందని సంఘం నాయకులు మండిపడ్డారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్