మణుగూరు లో బియస్పి కార్యాలయాన్ని ప్రారంభించిన బియస్పి శ్రేణులు .

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 18.

పినపాక నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యాలయాన్ని శనివారం ఉదయం 10 గంటలకు మణుగూరు మండల కేంద్రంలో ప్రారంభించినట్లు పినపాక నియోజకవర్గం ఇంచార్జి అలెo కోటి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ,జిల్లా నాయకులు, ఐదు నియోజకవర్గ, మండలాల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనట్లు తెలిపారు.బియస్పి నూతన కార్యాలయం నుండి భారీ ర్యాలీ గా బయలుదేరి బాబా సాహెబ్ అంబేద్కర్ కాంశ్య విగ్రహానికి పూలమాల వేసి తిరిగి నూతన కార్యాలయం వరకు ర్యాలీ గా వచ్చి బియస్పి జండాను పినపాక నియోజకవర్గం ఇంచార్జి అలం కోటి ఎగరావేయగా,నూతన కార్యాలయాన్ని పినపాక నియోజకవర్గం అధ్యక్షులు ఇర్పా రవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గం అధ్యక్షులు ఇర్పా రవి మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గం లో పార్టీ నీ బలోపేతం చేయుటకు సబ్బండ ప్రజల సమస్యల ను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళుటకు బియస్పి కార్యాలయం ఎల్లవేళలా ప్రజలందరికి అందుబాటులో ఉంటుందని, బియస్పి నూతన కార్యాలయం ప్రాంభోత్సవానికి సహకరించినటువంటి జిల్లా ఇ సి మెంబర్ పాక వెంకటేశ్వర్లు, మణుగూరు మండల అధ్యక్షులు పీక మల్లేష్, అశ్వాపురం యూత్ ప్రెసిడెంట్ ఇసంపల్లి శివ, బియస్పి నాయకులు బూర్గుల కరుణాకర్ ముఖ్య కార్యకర్త శోభన్,జిల్లా ఇ సి మెంబెర్ బొమ్మేర రాంబాబు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో పినపాక మండల అధ్యక్షులు అననియా, పినపాక నియోజకవర్గం ఉపాధ్యక్షులు యనగంటి సంపత్ కుమార్, పూనెం నరేష్ నియోజకవర్గం ప్రధాన కార్ష్యదర్శి లు,గుండాల మండల అధ్యక్షులు ఈసం వీరస్వామి,మడకం సైదులు జబ్బ కృష్ణ, బిట్ సెల్ అధ్యక్షులు ఇర్పా పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్