
జన సముద్రం న్యూస్ మల్కాజ్గిరి ప్రతినిధి తుపాకుల రమేష్ :18 మార్చ్
రాచకొండ కమీషనర్ శ్రీ. డి. ఎస్. చౌహాన్ ఐ పి ఎస్ నేరేడ్‌మెట్‌లోని సిపి కార్యాలయంలో పోలీసు మరియు ప్రాసిక్యూషన్ అధికారుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ సి.పి. చౌహాన్ మాట్లాడుతూ శిక్షా రేటును పెంచే లక్ష్యంతో రాచకొండ కమీషనరేట్ పరిదిలో కేసుల విచారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ క్రిమినల్ జస్టిస్ సిస్టంలోని అందరూ సమన్వయంతో పనిచేస్తే నేరస్తునికి తగిన శిక్ష పడుతుందన్నారు. అదే విదంగా పోలీసులు, ప్రోసిక్యూటర్స్ కలసి కేసుకు సంబందించిన విషయాలను చర్చించి ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా పనిచేస్తే నేరస్తులకు తగిన శిక్ష పడుతుందన్నారు . దీని వలన సమాజం లో నేర న్యాయ వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుంది

తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట శిక్షా రేటులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లను మరియు కోర్టు డ్యూటి ఆఫీసర్ ల కృషిని అభినందించారు. అదే విదంగా ఎన్ డి పి ఎస్ కేసులలో కూడా ఎస్ ఓ పి మరియు చెక్ లిస్ట్ లను అనుసరిస్తూ నేరస్తులకు తగిన శిక్ష పడే విదంగా చేయాలని సూచించారు.
జాయింట్ కమీషనర్ ,
వి .సత్యనారాయణ, ఐ.పి.ఎస్ మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి మరియు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం శిక్షా రేటును సాధించడానికి, బాధితులకు మరియు వారి కుటుంబాలకు సకాలంలో న్యాయం అందించే లక్ష్యంతో పోలీసులు సమయానుకూలంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని నాలుగు జోనల్ డి.సి.పి లు, క్రైమ్ డి.సి.పి, ఏ.సి.పి. సి.సి.ఆర్.బి, ఇన్వెస్టిగేషన్ అధికారులు, సి.డి.ఓ లు మరియు ప్రాసిక్యూషన్ తరపున డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి కస్తూరి ,జాయింట్ డైరెక్టర్ రాజి రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.





