
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 16.
మిషన్ భగీరథ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడ్వకేట్, సామాజిక కార్యకర్త కర్నె రవిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథ కార్మికులు గురువారం కలిశారు. ఈ సమావేశంలో కార్మికుల ఎదుర్కొంటున్న పలు సమస్యలు అనగా పనికి తగ్గ వేతనం, లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు పెంపుదల, సేఫ్టీ పరికరాలు, పిఎఫ్, ఈఎస్ఐ, పెట్రోల్ అలవెన్స్లు, 8 గంటలు డ్యూటీ ఓ అండ్ ఎం అగ్రిమెంట్ ప్రకారం రావలసిన జీతాలు గురించి మాట్లాడడం జరిగిందని కర్నె రవి తెలిపారు. కచ్చితంగా లేబర్ యాక్ట్ ప్రకారం రావలసిన జీతాలు పెంపుదల, అన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చే విధంగా మిషన్ భగీరథ జిల్లా అధికారులుతో, కంపెనీ ఏజెన్సీలతో మాట్లాడి కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని జిల్లా మిషన్ భగీరథ కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న గౌడ్, ప్రధాన కార్య దర్శి ముల్క నరేష్, భద్రాచలం సబ్ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు, భద్రాచలం సబ్ డివిజన్ ఉపాధ్యక్షులు సుందర్రావు, ఇల్లందు సబ్ డివిజన్ అధ్యక్షులు శ్రావణ్, ఇల్లందు సబ్ డివిజన్ ఉపాధ్యక్షులు సురేష్, కొత్తగూడెం సబ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పార్ధు పాల్గొన్నారు.





