యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ప్రభుత్వ విప్ రేగ కాంతారావు

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి . శ్రీనివాస్, ఆళ్లపల్లి, మార్చి 16.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండల కేంద్రంలో రేగా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రేగా కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్య అతిథులుగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు వారి చేతుల మీదుగా నగదు తో పాటు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు, గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా యువత ప్రతిదానిని స్వీకరించి తమ తమ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువత పెడదారి పడకుండా క్రీడలలో పాల్గొనడం వలన శరీరం దృఢంగా ,శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు . క్రీడలు ఎప్పుడు గ్రామంలో జరిగిన నా ప్రోత్సాహం ఉంటుంది అన్నారు.క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి