
జన సముద్రo న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, మార్చి 16.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం జానంపేట గ్రామంలోని ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ కవిత పై ఈ డి దర్యాప్తులకు నిరసనగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య మాట్లాడుతూ బిజెపి బెదిరింపులకు ఈడి నోటీసులకు భయపడే పార్టీ కాదని, అవినీతిపై పోరాడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.నరేంద్ర మోడీ ఎమ్మెల్సీ కవిత పై కక్షపూరిత దర్యాప్తులను వెనక్కు తీసుకోకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలో నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ నిలదొక్కుకోవడం కొరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఎన్ని కుట్రలు పన్నిన తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం వైపే ఉన్నారని రాబోయే రోజులలో కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణను రూపొందించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, పి ఎ సి ఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, ఎంపిటిసి కాయం శేఖర్, జానంపేట గ్రామ అధ్యక్షుడు గుండం దామోదర్, బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుల్లిబాబు, ముళ్ళపూడి ప్రకాశం , బుడుగుల శీను, ధర్మయ్య, సిరిండి అంజిబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





