తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. ఎల్లా అలెర్ట్ జారీ

Spread the love

తెలంగాణలో వాతావరణం మారింది. ప్రస్తుతం ఎండలతో ఉక్కపోత పోయాల్సి ఉండగా మొత్తం పరిస్థితి చల్లగా అయింది.
ప్రతి సంవత్సరం అకాల వర్షాలు పడటం మామూలే. కానీ పంటల మీద వచ్చే వర్షాలు ఇప్పుడు పంటలకు ముందే వస్తున్నాయి. గత వారం రోజులుగా వాతావరణం చల్లబడిపోయింది. మబ్బులు కమ్ముకుంటున్నాయి. చలి తీవ్రమవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు పడటం కామనే. కానీ ఇప్పుడు ఈ సమయంలో వాతావరణంలో మార్పులు రావడం గమనార్హం.

తెలంగాణకు ఎల్లో అలర్ట్

వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని చెబుతోంది. దీంతో రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది. నాలుగు రోజుల పాటు ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

వడగళ్ల వానలు పడతాయా?

సాధారణంగా ఈ సమయంలో పడే వానలు వడగళ్ల వానలే. పంటలు దెబ్బతినేలా చేసేలా వర్షాలు పడతాయి. చాలా సార్లు ఇలాంటి వానలతో రైతులు ఎంతో నష్టపోయారు. ఈ సారి కూడా ఆ ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. పలు జిల్లాల్లో కురిసే వర్షాలతో రైతులకు నష్టం జరుగుతుందో ఏమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో రైతులు దిగులు చెందుతున్నారు. అకాల వర్షాల ప్రభావంతో తమ పంటలు ఏమవుతాయో అనే బెంగ వారిలో పట్టుకుంది.

మామిడికి భారీ నష్టమేనా?

ఈ నేపథ్యంలో మామిడి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లనుంది. వడగళ్ల వాన పడితే పూత, కాత అంతా రాలుతుంది. దీంతో మామిడి రైతులకు మిగిలేది దుఖమే. ప్రకృతి వైపరీత్యాలకు భారీగా నష్టపోయేది రైతులే. ఆరుగాలం పండించిన పంట అరగంటలో నేల రాలడం చూసి గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమి ఉండదు. వాతావరణ శాఖ సూచనలతో రైతులు దీనంగా చూస్తున్నారు. తమ పంటలకు ఇక రక్షణ ఎలా అని మథనపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా రైతులకు ఓదార్పు దక్కడం కష్టమే.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి